NEWSANDHRA PRADESH

క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ వెంట‌నే నిర్మించాలి

Share it with your family & friends

కొబ్బ‌రి కాయ కొట్టి వినూత్న నిర‌స‌న

క‌డ‌ప జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి వినూత్నంగా నిర‌స‌న తెలిపారు. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరి కాయ కొట్టి నిరసన తెలిపారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి తయారైందన్నారు.

పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం నాటి దివంగత సీఎం వైఎస్సార్ చిత్తశుద్ధితో దీన్ని తీసుకొచ్చారని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. 10 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ఆశయం అన్నారు.

వైఎస్సార్ చనిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ స్టీల్ ప్లాంట్‌ ఊసే లేకుండా చేశారని ఆరోపించారు. సెయిల్‌ ద్వారానే ప్లాంట్‌ నిర్మించాలని విభజన హామీల్లో ఉందన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే నిర్మాణం జరిగి ఉండేదన్నారు ష‌ర్మిలా రెడ్డి .

ఏపీ పట్ల బీజేపీకి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన హామీలను సైతం ఆ పార్టీ తుంగలో తొక్కిందన్నారు. 2019లో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు , తిరిగి ఇప్పుడు ఆయ‌నే సీఎం గా ఉన్నార‌ని దాని గురించి మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.