NEWSNATIONAL

ద‌ళిత్ వాయిస్ ఎడిట‌ర్ ఇక లేరు

Share it with your family & friends

వీటీ రాజ‌శేఖ‌ర్ క‌న్నుమూత

క‌ర్ణాట‌క – ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ ద‌ళిత్ వాయిస్ ప‌త్రిక సంపాద‌కుడు వీటీ రాజ‌శేఖ‌ర్ క‌న్ను మూశారు. బుధ‌వారం మంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న మృతితో దేశం ద‌ళిత‌, బ‌హుజ‌న‌, గిరిజ‌న , తాడిత‌, పీడిత వ‌ర్గాలు శోక సంద్రంలో మునిగి పోయాయి. త‌న జీవిత కాల‌మంతా అణ‌గారిన ప్ర‌జ‌ల గొంతుక‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేశారు వీటీ రాజ‌శేఖర్. మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం తెలిపారు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.

దళిత్ వాయిస్ పత్రిక ద్వారా దళితుల సమస్యలను ప్రచురించి దేశ వ్యాప్తంగా దళిత వర్గాలను చైతన్య వంతం చేశారు వీటీ రాజ‌శేఖ‌ర్. ఆయ‌న పూర్తి పేరు వొంటిబెట్టు తిమ్మ‌ప్ప రాజ‌శేఖ‌ర్ శెట్టి. 1932లో పుట్టారు. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప‌త్రిక‌గా గుర్తింపు పొందింది.

వీటి రాజశేఖ‌ర్ 25 ఏళ్ల పాటు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ ప‌త్రిక‌లో ప‌ని చేశారు. ద‌ళిత ఉద్య‌మానికి త‌న ప‌త్రిక ద్వారా ఊపిరి పోశారు. 1981లో దీనిని ప్రారంభించారు. 1986లో హిందూ మ‌తానికి వ్య‌తిరేకంగా రాసినందుకు గాను వీటీ రాజ‌శేఖ‌ర్ పాస్ పోర్టును జ‌ప్తు చేశారు. తీవ్రవాదానికి మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నాడ‌ని ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

ఆయ‌న రాసిన క‌ర‌ప‌త్రాలు, పుస్త‌కాలు ఎంతో ఆలోచింప చేశాయి. క‌ర్ణాట‌క‌లో ద‌ళితుల ఉద్యమం, హిందూ భార‌తంలో మార్క్స్ ఎలా మ‌ర‌ణించాడు, గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు, హిందూ పాము..ముస్లిం ముంగీస‌, భూ దేవ‌త‌ల సంభాష‌ణ‌, చ‌రిత్ర తీర్పు, భార‌త దేశంలో వ‌ర్ణ వివ‌క్ష అనేవి అత్యంత ఆద‌ర‌ణ పొందాయి.