NEWSANDHRA PRADESH

వైసీపీ హ‌యాంలో రూ. 20 వేల కోట్ల విద్యుత్ భారం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి – వైసీపీ హయాంలో మిగులు విద్యుత్ నుంచి రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌పై రూ.20 వేల కోట్ల భారం ప‌డింద‌ని ఆవేద‌న చెందారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ఏడెనిమిది వేల మెగా వాట్ల సోలార్, విండ్ విద్యుత్ ఉత్ప‌త్తి నిలిపివేత

విద్యుత్ కొనుగోళ్లు పేరుతో అనుయాయుల‌కు వేల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు . గ‌త ఐదేళ్ల‌లో 9 సార్లు విద్యుత్ చార్జీల‌ను పెంచిన ఘ‌న‌త వైసీపీ ప్రభుత్వానిదేన‌ని మండిప‌డ్డారు. వ్య‌వ‌సాయ రంగానికి పగటిపూట 9 గంట‌ల నిరంతరాయ విద్యుత్ అందించ‌డ‌మే ల‌క్ష్యం అన్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడుపై న‌మ్మ‌కంతో… విద్యుత్ రంగంలో రూ.10 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌న్నారు. బుధ‌వారం శాస‌న మండ‌లిలో గొట్టిపాటి ర‌వికుమార్ మాట్లాడారు.

2019 వ‌ర‌కు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంద‌ని, అనంత‌రం అధికారం చేప‌ట్టిన వైసీపీ ప్రభుత్వం విధ్వంస‌క‌ర నిర్ణ‌యాల‌తో విద్యుత్ రంగాన్ని వేల కోట్ల రూపాయిల న‌ష్టాల్లోకి నెట్టేసింద‌ని పేర్కొన్నారు.

కేవ‌లం వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో ఏడెనిమిది వేల మెగావాట్ యూనిట్ల‌ సోలార్, విండ్ విద్యుత్ ఉత్ప‌త్తిని నిలిపి వేశార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఈ విధంగా విద్యుత్ ఉత్ప‌త్తిని నిలిపి చేయ‌డ‌మే కాకుండా… మ‌రోప‌క్క‌ ప‌వ‌ర్ ప‌ర్చేజ్ ల పేరుతో…. వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల అనుయాయుల‌కు వేల కోట్ల రూపాయిలు దోచి పెట్టార‌ని మంత్రి మండిప‌డ్డారు.