తల్లి..చెల్లి పేరుతో రాజకీయం చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ రెడ్డి
తాడేపల్లి గూడెం – వైఎస్సార్సీపీ చీఫ్ , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఏకి పారేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి కుటుంబంలో విభేదాలు ఉంటాయని అన్నారు. ఇది సర్వ సాధారణమైన విషయమని పేర్కొన్నారు. పనిగట్టుకుని తమను టార్గెట్ చేశారని , అయినా భయపడే ప్రసక్తి లేదన్నారు జగన్ రెడ్డి. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 2 శాతం తేడాతో తాము ఓటమి పాలయ్యామని, తాము ఓడి పోవడం వెనుక ఎవరు ఉన్నారనేది ప్రజలకు తెలుసన్నారు.
ఇది పక్కన పెడితే పదే పదే ఐటీడీపీ పేరుతో సోషల్ మీడియాలో పనిగట్టుకుని వ్యక్తిగత హననం చేస్తూ చిల్లర కామెంట్స్ పెడుతున్నారని ఆవేదన చెందారు జగన్ మోహన్ రెడ్డి. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తాము పరిష్కరించుకుంటామని ఈ సంగతి మీకు ఎందుకని ప్రశ్నించారు వైసీపీ బాస్.
మీకు కుటుంబం లేదా అని ప్రశ్నించారు. షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించ లేదా అని నిలదీశారు జగన్ రెడ్డి. నాతో సహా నా తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టారని ఆరోపించారు.