కోదండరామ్..మీర్ కు బిగ్ షాక్
ఎమ్మెల్సీల ఎంపికపై స్టేటస్ కో
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసిన కోదండరామ్ , మీర్ అలీ ఖాన్ లకు బిగ్ షాక్ తగిలింది. వీరికి రాజకీయ నేపథ్యం ఉందంటూ ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వీరి నియామకం పూర్తిగా రాజకీయ పరంగా చోటు చేసుకుందని ఆరోపించింది. దీంతో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయాల్సి ఉండగా నిలుపుదల చేయాలని ఆదేశించింది కోర్టు. ఫిబ్రవరి 8 వరకు తుది తీర్పు ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇందుకు సంబంధించి స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై పునరాలోచనలో పడింది గవర్నర్ తమిళి సై. ఇదిలా ఉండగా కోదండరామ్ ను ఎమ్మెల్సీగా కాకుండా చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి జన సమితి నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.