భారత మహిళా హాకీ జట్టుకు మోడీ కంగ్రాట్స్
చైనాను ఓడించి ఛాంపియన్ గా నిలిచి
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ భారత మహిళా హాకీ జట్టును అభినందించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మీరు సాధించిన ఈ విజయం యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన ఆసియా కప్ హాకీ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 1-0 తేడాతో చైనా జట్టును ఓడించింది. దీంతో మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఆసియాలో అగ్రస్థానంలో ఉన్నామని నిరూపించు కునేందుకు భారత్ టైటిల్‌ను కాపాడుకుంది.
చివరి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆట ప్రథమార్థలో భారత్‌ను గోల్ చేయనివ్వకుండా చైనా అడ్డుకుంది. కానీ రెండో భాగంలో భారత్ ఒక గోల్ ను చేసింది. ఇదిలా ఉండగా ఈ టోర్నీలో మొత్తం 11 గోల్స్ చేసి అగ్ర స్థానంలో నిలిచింది ఇండియాకు చెందిన హాకీ ప్లేయర్ దీపిక. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో ఏకైక గోల్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది.
ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి సైతం ప్రశంసలు కురిపించారు అమ్మాయిలపై.