విద్యార్థులకు పరామర్శ శ్రీనివాస్ గౌడ్ భరోసా
ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థత
మహబూబ్ నగర్ జిల్లా – నారాయణ పేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
విషయం తెలుసుకున్న వెంటనే ఆయన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి పరామర్శించారు. బాధిత విద్యార్థులను ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతతో ఉన్న విద్యార్థులకు ఇవాళ కూడా పురుగులతో కూడిన టిఫిన్ పెట్టారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక విద్యా సంస్థలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
బాధితులకు మెరుగైన వైద్య సాయం చేయాలని సూచించడం జరిగందన్నారు. పిల్లలకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించకుండా కావాలని నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిపడ్డారు వి. శ్రీనివాస్ గౌడ్. వారికి కావాల్సిన సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.