అన్ని ప్రాంతాల్లో అభివృద్ది జరగాలి – సీఎం
గత సర్కార్ మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదు
అమరావతి – అన్ని ప్రాంతాలలో సమగ్ర అభివృద్ది జరగాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం జరిగిన అసెంబ్లీలో ఆయన ప్రధాన అంశాలపై ప్రసంగించారు. గత ప్రభుత్వం కావాలని ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. దీంతో సమగ్ర అభివృద్దికి నోచుకోక ఆమడ దూరంలో ఉన్నాయని ఆవేదన చెందారు.
ఇప్పటికే ఆంధ్ర పరంగా చూసుకుంటే విజయవాడ బెటర్ అని ఇక ఉత్తరాంధ్రలో విశాఖపట్టణం, రాయలసీమలో కర్నూలు అభివృద్ది కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నారా చంద్రబాబు నాయుడు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
సమగ్ర అభివృద్ది చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అని స్పష్టం చేశారు. గతంలో రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. సాధ్యమైనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర సర్కార్ కు తీర్మానాలు పంపిస్తామని తెలిపారు సీఎం.
రాళ్ల సీమలా ఉండే రాయలసీమకు నీళ్లు అందించామని అన్నారు. అంతే కాకుండా లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయని ప్రకటించారు నారా చంద్రబాబు ఆనయుడు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.