గంగపుత్రుల అభివృద్దికి కృషి చేశాం – మాజీ సీఎం
జగన్ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి – వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ రెడ్డి గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు .
సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగు పరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.
వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు మాజీ సీఎం. సబ్సిడీపై డీజిల్లు అందించడం జరిగిందన్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.