NEWSANDHRA PRADESH

ఏపీలో చెత్త ప‌న్ను ర‌ద్దు బిల్లుకు ఆమోదం

Share it with your family & friends

స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌తిపాదించిన నారాయ‌ణ

అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క బిల్లుకు ఆమోదం తెలిపింది. చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు శాస‌న స‌భ ఓకే చెప్పింది. ఈ బిల్లును ప్ర‌తిపాదించారు రాష్ట్ర ప‌ట్ట‌ణ‌, పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.

గత ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా చేసిన వ్యవహారంపై విచారణ చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా గత ప్రభుత్వం చెత్త సేకరించడానికి పన్ను విధించింది .సర్వీస్ ప్రొవైడర్లు ద్వారా వాహనాలు ఏర్పాటు చేసి 40 మున్సిపాలిటీల్లో పన్నులు వసూలు చేసింది.

చెత్తను సేకరించడానికి నెలకి 51,641రూపాయల నుంచి 62,964 రూపాయల వరకూ చెల్లించింది. విశాఖ ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో శ్పాప్, గుంటూరు ,అనంతపురం రెడ్డి ఎంటర్ప్రైజెస్ కి చెత్త సేకరణ కు కాంట్రాక్టు ఇచ్చారు.

40 మున్సిపాలిటీలలో నెలకి 13.9 కోట్లకి ఇచ్చారని తెలిపారు పొంగూరు నారాయ‌ణ‌. 2021 లో నవంబర్ నుంచి చెత్త పన్ను కలెక్ట్ చేయడం ప్రారంభించారని పేర్కొన్నారు. నెలకి గృహాలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు సేకరించారని తెలిపారు.

వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10,000 వరకు సేకరించారని వెల్ల‌డించారు. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నవారికి కూడా చెత్త పన్ను సంవత్సరానికి 356 రూపాయలు వేశార‌ని ఆరోపించారు పొంగూరు నారాయ‌ణ‌.