ద్వితీయ శ్రేణి నగరాలలో ఐటీ కంపెనీలు
శాసన సభలో మంత్రి నారా లోకేష్ ప్రకటన
అమరావతి – ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఐటీ పరంగా ఏపీ ముందుకు వెళుతోందని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పై ఫోకస్ పెట్టామన్నారు. గురువారం జరిగిన శాసన సభ లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున ఏపీకి తీసుకు రావాలని తాను ప్రయత్నం చేస్తున్నానని, ఇప్పటికే తాను కీలకమైన , ప్రపంచంలో పేరు పొందిన 100 కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగిందని వెల్లడించారు.
ప్రధాన నగరాలతో పాటు పట్టణాలు, ద్వితీయ శ్రేణి నగరాలలో సైతం ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయాలన్నది తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు నారా లోకేష్. కీలకమైన సంస్థలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.
ప్రధానంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కో వర్కింగ్ స్పేస్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీని కోసం పాలసీ కూడా తీసుకొస్తున్నామని ప్రకటించారు నారా లోకేష్.