రీ సర్వే పేరుతో భూముల కభ్జా – అనగాని
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం
అమరావతి – ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం జరిగిన శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భూముల రీ సర్వే పేరిట ప్రజాధనాన్ని దోచుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వం భారీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
రీసర్వేను అడ్డు పెట్టుకుని స్వంత వారికి లబ్ధి చేకూర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పబ్లిసిటీలో పెట్టిన శ్రద్ధ పేద రైతులకు న్యాయం చేయడంలో పెట్ట లేదని ఆవేదన చెందారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
పద్ధతి ప్రకారం రీసర్వే జరగనే లేదన్నారు. ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. భూ రీ సర్వే పేరుతో రూ.900 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. ఇప్పటికీ 6,631 గ్రామ సభల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు మంత్రి అనగాని ప్రసాద్. మాది రైతు హితం కోరే ప్రభుత్వమని స్పష్టం చేశారు. గ్రామ సభలు పూర్తి అయ్యాక ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు.