ఏపీ అభివృద్ది కోసం కృషి చేద్దాం
శాసన సభలో నారా లోకేష్ పిలుపు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కలిసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. గురువారం జరిగిన శాసన సభలో ఆయన మాట్లాడారు. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీల వెంట తాము పరుగులు పెడుతున్నామని చెప్పారు.
అందరం కలిసి పనిచేసి పెట్టుబడులు సాధించి, ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిద్దామని అన్నారు. హైదరాబాద్ లాగే విశాఖ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఐటీ, లాజిస్టిక్ , ఆటోమొబైల్ , ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , తదితర రంగాలలో ఏపీ రాష్ట్రం ముందంజలో కొనసాగాలని అన్నారు నారా లోకేష్.
ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను ఇప్పటి వరకు 100కు పైగా ఐటీ కంపనీల అధినేతలతో మాట్లాడానని అన్నారు. టీసీఎస్ ఆర్ అండ్ బి సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుందని ప్రకటించారు.
ఇదే సమయంలో జిందాల్ స్టీల్ కంపెనీ ఏకంగా రూ. 75,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందన్నారు. 25 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.