NEWSANDHRA PRADESH

రాష్ట్ర విభ‌జ‌న ఏపీకి పెద్ద దెబ్బ

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ ఐటీ, విద్యా, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీ రాష్ట్రం విడి పోవ‌డంపై మ‌రోసారి ప్ర‌స్తావించారు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి తీర‌ని న‌ష్టం జ‌రిగింద‌న్నారు నారా లోకేష్‌.

ఇదే స‌మ‌యంలో టీడీపీ సర్కారు 2014-19 కాలంలో 53 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని తెలిపారు. జగన్ వచ్చాక 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయని వాపోయారు. వోల్టాస్, మైక్రోమ్యాక్స్, జీఎం మ్యాడ్యూల్ వంటి కంపెనీలు రాకుండా పోయాయ‌ని మండిప‌డ్డారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అన్నారు.

అతి ఎక్కువ పన్ను చెల్లించే ప్రఖ్యాత కంపెనీ అమరరాజాపై జగన్ సర్కారు వేధింపులు పరాకాష్టకు చేరడంతో వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లి పోయారని మండిప‌డ్డారు. హెచ్సీఎల్ కంపెనీలో ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టు కోసం శ్రీకాళహస్తి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూదనరెడ్డి… ఆ కంపెనీ ఉన్నతోద్యోగిని భోజనానికి పిలిచి బంధించాడని అన్నారు.

ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో జ‌గ‌న్ రెడ్డి ఏపీ రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌నికి రాకుండా చేయ‌డంతో వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు నానా తంటాలు ప‌డుతున్న‌ట్లు చెప్పారు నారా లోకేష్‌.