ప్రాణాలకు ముప్పున్నా ఉక్కుపాదం మోపా
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తాను సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించినా తాను వెనక్కి తగ్గదలేదన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం జరిగిన శాసన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయినా ఎక్కడా తగ్గలేదన్నారు. ప్రాణాలు పోయినా సరే రాష్ట్ర ప్రజలు బాగుండాలని తాను కోరుకున్నానని, ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. చివరకు తాను అడ్డు పడుతున్నానని తనను మట్టు పెట్టేందుకు ప్రయత్నం చేశారని అదంతా రాష్ట్ర ప్రజలకు, మీకు కూడా తెలుసన్నారు.
ఆ కలియుగ వేంకటేశ్వరుడి ఆశీస్సులతో తాను బతికి బయట పడ్డానని స్పష్టం చేశారు సీఎం. ప్రజల ప్రశాంత జీవనం కోసం ఫ్యాక్షనిస్టు ముఠాలపై, మత తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపానని చెప్పారు. ఫలితంగా ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా పోయాయని అన్నారు.. హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం ఉందని , దానికి తానే కారణమని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు .