చంద్రబాబు పదేళ్ల పాటు సీఎంగా ఉండాలి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు కాదు మరో దశాబ్దం పాటు సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గురువారం జరిగిన శాసన సభలో వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నాయుడు విజన్ గొప్పదన్నారు. ఆయన కన్న కలలు నెరవేర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు అవసరమైన మద్దతు తాము ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
ఇదే స్పూర్తిని కొనసాగించాలని, చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఏపీ అభివృద్ది కోసం మరింత ఫోకస్ పెడతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మీరు కన్న కలలను నెరవేర్చేందుకు తాము కూడా ఓ చేయి వేస్తామన్నారు.