చక్రం తిప్పిన జన సేనాని
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్
అమరావతి – నిన్నటి దాకా రాజకీయాలు చేయడం తెలియదంటూ ఎద్దేవా చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు కొణిదల పవన్ కళ్యాణ్. ఎవరూ ఊహించని రీతిలో ఏపీ పీఏసీ చైర్మన్ ఎవరు అవుతారనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు జనసేనాని.
ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెడతారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. కానీ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది జగన్ రెడ్డి పార్టీకి. ఆయన కోరినా పట్టించు కోలేదు కూటమి సర్కార్.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో లెక్క పద్దులకు సంబంధించి పూర్తి పవర్ ఫుల్ పోస్ట్ పీఏసీ చైర్మన్ పోస్టు. దీనిని కైవసం చేసుకునేందుకు టీడీపీ, బీజేపీ ప్రయత్నం చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఒకే ఒక్కడు నామినేషన్ దాఖలు చేశారు. పులిపర్తి రామాంజనేయులు చివరకు ఏపీ పీఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
మిగతా టీడీపీ, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. వారిలో శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబుకు చోటు దక్కింది.