10 రోజులు 75 ప్రశ్నలు 21 బిల్లులు
ముగిసిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది . అసెంబ్లీ మొత్తం 10 రోజుల పాటు నడించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు పాల్గొన్నారు.
ఈ శాసన సభ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ గా టీడీపీకి చెందిన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజును ఎంపిక చేశారు నారా చంద్రబాబు నాయుడు. మరో వైపు కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు. గతంలో జగన్ రెడ్డి తీసుకు వచ్చిన చెత్తపై పన్నును రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఏపీ శాసన సభ మొత్తం 10 రోజులు నడవగా ఇందులో ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తం 75 ప్రశ్నలు అడిగారు.
మొత్తం 21 బిల్లులను శాసన సభలో ప్రవేశ పెట్టారు. సభ 59 గంటల 57 నిమిషాల పాటు సాగింది. అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధిత శాఖల మంత్రులు తాపీగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. సభ హుందాతనాన్ని కాపాడాలని , ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరారు.