మరణం లేని గాయకుడు గద్దర్
ప్రజా యుద్ద నౌకకు ఘన నివాళులు
హైదరాబాద్ – ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం, పాట కొనసాగినంత కాలం, సాంస్కృతిక ఉద్యమం ప్రవహిస్తున్నంత కాలం ప్రజా యుద్ద నౌక , పాటల పూదోట గద్దర్ బతికే ఉంటాడని కొనియాడారు కవులు, గాయనీ గాయకులు, రచయితలు, మేధావులు, ప్రజా సంఘాల బాధ్యులు.
ఈ సందర్బంగా ఆయన చేసిన పోరాటం ఎల్లప్పుడూ గుర్తుండి పోతుందని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తన అద్భుతమైన ఆట పాటలతో కోట్లాది మందిని చైతన్యవంతం చేసిన తీరు తనను విస్తు పోయేలా చేసిందన్నారు. అందుకే తమ సర్కార్ గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.
గద్దర్ ఏ ఒక్కరికో చెందిన వ్యక్తి కాదని నాలుగున్నర కోట్ల ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు కవి, గాయకులు. ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన
ప్రజా గాయకుడు గద్దర్ అని కొనియాడారు మంత్రి జూపల్లి కృష్ణా రావు.
సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి, తన గళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవలను గుర్తు చేశారు పలువురు.