న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలి
పిలుపునిచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ , మధ్యవర్తిత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మరింతగా తెలుసుకునేలా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సీఎం. ప్రధానంగా ప్రజాస్వామిక దేశంలో ఇది మరింత కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. రోజు రోజుకు కేసులు పేరుకు పోతుండడం ఒకింత ఆందోళన కలిగించే అంశమన్నారు.
అయినా న్యాయ వ్యవస్థలో కేసులు పరిష్కరిస్తూనే ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ జీవనధార అని అన్నారు. అయితే కేసులు పెండింగ్ లో ఉండడం సవాల్ గా మారిందన్నారు. దీనిని అధిగమించేందుకు న్యాయ వ్యవస్థ ప్రయత్నం చేయాలని సూచించారు.
అర్బ్-మెడ్ (ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలు) అనేది న్యాయాన్ని వేగవంతమైన వేగంతో నిర్ధారించడానికి కీలకమైన మార్గం, అయితే సాధారణ ప్రజలకు చేరుకోవడానికి దాని పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు అనుముల రేవంత్ రెడ్డి.