NEWSNATIONAL

రాష్ట్ర‌పతిపై విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హితం

Share it with your family & friends

మండిప‌డ్డ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

న్యూఢిల్లీ – కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై మండిప‌డ్డారు. ప్ర‌తి దానిని రాజ‌కీయ కోణంలో చూడ‌డం, అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.

బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్ర‌ప‌తి దేశానికి తొలి ప్ర‌థ‌మ పౌరురాల‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. తాము ఇన్నేళ్లుగా ఎలా దేశాన్ని అభివృద్ధి ప‌థంలోకి తీసుకు వెళ్లామో ముర్ము వివ‌రించార‌ని, ఇది త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

ఈ దేశ చ‌రిత్ర‌లో మ‌రో రికార్డు రాబోతోంద‌న్నారు. అదేమిటంటే ప్ర‌ధాన మంత్రిగా మోదీ తిరిగి మూడోసారి కొలువు తీర బోతున్నార‌ని జోష్యం చెప్పారు మంత్రి కిష‌న్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని మా పాలనలో చేశామ‌న్నారు.

అభివృద్ధి జరిగిన తీరును రాష్ట్రపతి వివరించారని అన్నారు. గ్రామ పంచాయితీల కాలపరిమితి ఈరోజుతో ముగుస్తోందన్నారు. పంచాయితీరాజ్‌ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కిషన్‌ రెడ్డి.