డిప్యూటీ సీఎంతో ప్రశాంతిరెడ్డి భేటీ
సమస్యలు పరిష్కరించాలని విన్నపం
అమరావతి – కోవూరు శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలతో భేటీ అయ్యారు. తన పుట్టిన రోజు సందర్బంగా కంగ్రాట్స్ తెలియ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు పంచాయతీ రాజ్ పరిధిలో గ్రామీణ రోడ్లు, ఉపాధి హామీ పనుల పై చర్చించారు. నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని అభ్యర్థించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ సహకారం అందజేయాలని కోరారు.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరిన మేరకు అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించడం జరిగిందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.