NEWSTELANGANA

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాలి – క‌విత

Share it with your family & friends

బీసీ క‌మిష‌న్ కు త్వ‌ర‌లో నివేదిక

హైద‌రాబాద్ – తెలంగాణ జాగృతి సంస్థ చీఫ్ , శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌ధానంగా రిజ‌ర్వేష‌న్ అంశం గురించి చ‌ర్చించారు. ఇందుకు సంబంధించి మేధావులు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు కీల‌క‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు అంద‌జేశారు.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ( బీసీ ) కమిషన్‌కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అవసరాలను తీర్చడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాల‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.
సామాజిక న్యాయం దేశ సామాజిక స్వరూపాన్ని మాత్రమే బలోపేతం చేస్తుంద‌ని గుర్తించాల‌ని అన్నారు.