మరాఠా ప్రజలు అభివృద్దికి ఓటేశారు
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
కృష్ణా జిల్లా – మరాఠా ప్రజలు ఏకపక్షంగా మరోసారి ఎన్డీయే మహాయుతికి పట్టం కట్టారని , ఇది కేవలం సుస్థిర, సమర్థవంతమైన, అభివృద్దితో కూడిన నాయకత్వానికి దక్కిన విజయమని పేర్కొన్నారు ఏపీ బీజేపీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.
తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ కూటమికి ఘన విజయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు బీజేపీ చీఫ్.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో సమిష్టి కృషితో గ్రాండ్ విక్టరీని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రత్యేకంగా అభినందించారు దగ్గుబాటి పురందేశ్వరి.
ఇదే సమయంలో జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఎందుకు ఓడి పోయిందనే దానిపై సమీక్షించడం జరుగుతుందని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఓడి పోతుందని చాలా మంది చెప్పారని, కానీ ప్రజలు వారి అంచనాలు తలకిందులు చేశారని ఇది మోడీ నాయకత్వానికి దక్కిన గౌరవం అని అన్నారు.