NEWSTELANGANA

స‌మ‌గ్ర కుల గ‌ణ‌న‌పై భ‌ట్టి ఆరా

Share it with your family & friends

ఉన్న‌తాధికారులతో వీడియో కాన్ఫ‌రెన్స్

జార్ఖండ్ – జార్ఖండ్ లో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు వ‌చ్చేశాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇంఛార్జ్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రాష్ట్రంలో తిరిగి ప‌వ‌ర్ లోకి రావ‌డంతో ఆయ‌న సంతోషంగా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా భ‌ట్టి విక్ర‌మార్క జార్ఖండ్ లోనే ఉన్నారు. అక్క‌డి నుంచి రాష్ట్రానికి సంబంధించి కుల గ‌ణ‌న స‌రిగా జ‌రుగుతుందా లేదా అని ఆరా తీశారు. సమగ్ర కుల గణన సర్వే పురోగతిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేప‌ట్టారు.

డోర్ లాక్‌లు, వలసదారుల వివరాల వంటి సవాళ్లను పరిష్కరించడం, ఖచ్చితమైన డేటా నమోదు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కుల గణన ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ కుల గ‌ణ‌న ఆధారంగా కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ చేప‌ట్టే కుల గ‌ణ‌న దేశంలోనే రోల్ మోడ‌ల్ గా మారుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.

కొన్ని చోట్ల ఎన్యూమ‌రేట‌ర్లు రాలేదంటూ కొంద‌రు స్థానికులు వాపోతున్నారు.