పవర్ స్టార్ పొలిటికల్ గేమ్ ఛేంజర్
నాగబాబు కొణిదల షాకింగ్ కామెంట్స్
అమరావతి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై స్పందించారు. జనసేనాని మరాఠాలో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా అన్ని నియోజకవర్గాలలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం.
ఈ సందర్బంగా ఫలితాలపై, తన సోదరుడు చేసిన ప్రచారంపై స్పందించారు. ఆదివారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు నాగబాబు కొణిదల. భారతీయ రాజకీయాలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అలియాస్ పవర్ స్టార్ పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా మారాడంటూ స్పష్టం చేశారు. ఇక తన సోదరుడికి తిరుగే లేదన్నారు.
గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కాని ప్రతి హీరో నాయకుడు కాలేడని పేర్కొన్నారు. నాయకుడంటే గెలిచే వాడే కాదు నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం, అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం
నీడై నిలబడే వాడు, తోడై నడిపించే వాడు, వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు,
వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు, అలాంటి అరుదైన నాయకుడే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబు ఇచ్చారు.