DEVOTIONAL

26న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుపతి – తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆల‌యంలో న‌వంబ‌రు 28 నుండి డిసెంబ‌ర్ 6వ తేది వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని 26న‌ మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్ర నామార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడ‌తారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మ వారి దర్శనానికి అనుమతిస్తారు.

ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది. అదే విధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.