ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి ఖరారు
ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ఈసారి జరగబోయే శాసన సభ , సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని కంకణం కట్టుకున్నారు.
ఈ మేరకు వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెక్ పెట్టారు. పనితీరు ఆధారంగానే ఈసారి టికెట్లు కేటాయించడం జరుగుతుందని ముందే ప్రకటించారు. ఆ మేరకు ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు.
ఊహించని రీతిలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన చెవిరి రెడ్డి భాస్కర్ రెడ్డికి ఊహించని రీతిలో సీటు మార్చారు. ఆయనకు ఉన్నట్టుండి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఈ మేరకు ఆయన సూచనల మేరకు వైసీపీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ చెవిరెడ్డి వైపే జగన్ రెడ్డి మొగ్గు చూపడం విశేషం.