NEWSANDHRA PRADESH

ప్ర‌ధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్

Share it with your family & friends

కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష

విశాఖ‌ప‌ట్టణం – ఏపీకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రానున్నారు. ఈ మేర‌కు పీఎంఓ కార్యాల‌యం నుంచి అధికారికంగా స‌మాచారం అందింద‌ని తెలిపారు విశాఖ క‌లెక్ట‌ర్. ఇదిలా ఉండ‌గా పీఎం టూర్ షెడ్యూల్ ను వెల్ల‌డించారు. పీఎం టూర్ సంద‌ర్బంగా ఆదివారం స‌మీక్ష చేప‌ట్టారు.

ప్రాథ‌మిక షెడ్యూల్ ప్ర‌కారం విశాఖ‌ప‌ట్ట‌ణం ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో బ‌హిరంగ స‌భ ఉంటుంది. రోడ్ షో సంద‌ర్బంగా 29వ తేదీ సాయంత్రం 3.40 గంట‌ల‌కు వాయు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు.

అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా కాన్వెంట్ జంక్ష‌న్, రైల్వే స్టేష‌న్, సంప‌త్ వినాయ‌క్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్ష‌న్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్ర‌ధాన వేదిక వ‌ద్ద‌కు 4.40 గంట‌ల‌కు వ‌స్తారు. ఈ క్ర‌మంలో టైకూన్ జంక్ష‌న్ నుంచి ఎస్పీ బంగ్లా వ‌ర‌కు 500 మీట‌ర్ల మేర రోడ్ షో నిర్వ‌హిస్తారు.

ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ ప్ర‌ధాని బ‌హిరంగ స‌భ‌కు చేరుకుంటారు. అక్క‌డ నిర్దేశించిన‌ కార్య‌క్ర‌మంలో 4.45 నుంచి 5.00 గంట‌ల వ‌రకు పాల్గొని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడటంతో పాటు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రిల‌తో క‌లిసి వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తారు. అనంత‌రం 5.45 గంట‌ల‌కు స‌భ నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగు ప‌య‌న‌మ‌వుతారు.

పోలీస్ కమిష‌న‌ర్ శంక‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ పి. సంప‌త్ కుమార్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భ‌వానీ శంక‌ర్, ఆర్డీవోలు పి. శ్రీలేఖ‌, సంగీత్ మాధుర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.