క్రికెట్ అంటే ఇష్టం కానీ ఆడలేను – చంద్రచూడ్
జాతీయ ఛానల్ చిట్ చాట్ లో మాజీ సీజేఐ కామెంట్
ఢిల్లీ – మాజీ సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు క్రికెట్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. ఎన్డీటీవీతో ఆయన చిట్ చాట్ సందర్బంగా పలు అంశాల గురించి పంచుకున్నారు. తనకు క్రికెట్ పట్ల ఆసక్తి ఎక్కువ అని పేర్కొన్నారు. తనకు కూడా ఆడాలని ఉంటుందని, కానీ ఇప్పుడు ఆడలేనని అన్నారు. దీనికి కారణం తన వయసు అందుకు సరి పోదంటూ చమత్కరించారు జస్టిస్ చంద్రచూడ్.
నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటానని చెప్పారు. కానీ ఇదే సమయంలో క్రికెట్ కు సంబంధించి మ్యాచ్ లు జరుగుతుంటే చూస్తూ ఉంటానని తెలిపారు. ఇందులో ఏదో తెలియని అనుభూతి అనేది కలుగుతుందని , అందుకే ఆ ఆట అంటే ఇష్టమని చెప్పారు జస్టిస్ చంద్రచూడ్.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సీరీస్ ను చాలా దగ్గరుండి చూస్తున్నానని తెలిపారు. నేను బిజీగా ఉండడం వల్ల మ్యాచ్ ను లైవ్ లో చూడలేనని అన్నారు. కానీ హైలెట్స్ చూస్తానని చెప్పారు చంద్రచూడ్. కోహ్లీ ఎలా ఆడాడు, అశ్విన్ , బుమ్రా బౌలింగ్ బాగా చేశారా అని చూస్తానని అన్నారు.