NEWSTELANGANA

మ‌హిళల ఉచిత ప్ర‌యాణంపై విచార‌ణ

Share it with your family & friends

రిట్ పిటిష‌న్ గా మార్చాల‌ని ఆదేశం

హైద‌రాబాద్ – తెలంగాణలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌లో మ‌హిళ‌లంద‌రికీ ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించింది. దీంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ఊహించ‌ని రీతిలో పెరిగింది. ఇదే స‌మ‌యంలో బ‌స్సుల‌లో ర‌ద్దీ పెరిగింది. కానీ ప్ర‌యాణం చేసేందుకు బ‌స్సులు స‌రి పోవ‌డం లేదు.

ప్ర‌త్యేకించి బ‌స్సుల‌లో సీట్ల‌న్నీ నిండి పోవ‌డంతో త‌మ‌కు నిల్చునేందుకు కూడా ప్లేస్ లేకుండా పోయిందంటూ హైకోర్టును ఆశ్ర‌యించాడు హైద‌రాబాద్ లోని నాగోల్ ప్రాంతానికి చెందిన హ‌రింద‌ర్. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం కింద వేసిన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని, కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదన్న పిటిష‌నర్ వాపోయారు. ఇందు కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని కోరారు హ‌రింద‌ర్.

ఇదిలా ఉండ‌గా ఈ పిటీషన్‌లో ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది హైకోర్టు. పిటీషనర్ ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారన్న ధర్మాసనం. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది కోర్టు.