SPORTS

రూ. 26.75 కోట్ల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్

Share it with your family & friends

స్వంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్

జెడ్డా – వ‌చ్చే ఏడాది టాటా ఐపీఎల్ టోర్నీకి సంబంధించి జెడ్డా వేదిక‌గా వేలం పాట కొన‌సాగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. భారీ ఎత్తున పోటీ నెల‌కొంది . ఆట‌గాళ్ల‌ను స్వంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే రిష‌బ్ పంత్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ లు భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో రికార్డ్ సృష్టించారు పంత్. త‌న‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్ల‌కు తీసుకుంది. అంత‌కు ముందు స‌న్ రైజ‌ర్స్ రూ. 18 కోట్ల‌కు ఆఫ‌ర్ ఇచ్చింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఇదే స‌మ‌యంలో మ‌రో ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అమ్ముడు పోయాడు. త‌న‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఫ్రాంచైజీ స్వంతం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ డేవిడ్ మిల్ల‌ర్ ను రూ. 7.50 కోట్ల‌కు తీసుకుంది.

ఇక సూప‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ గా ఇప్ప‌టికే పేరు పొందిన కోల్ క‌తా కు చెందిన మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం రూ. 10 కోట్ల‌కు తీసుకుంది. బౌలింగ్ ప‌రంగా మ‌రింత బ‌లం పెంచుకునేందుకు ఎస్ఆర్హెచ్ సీఈవో కావ్య మార‌న్ ఫోక‌స్ పెట్టింది.