రూ. 14 కోట్లకు కేఎల్ ఢిల్లీ కైవసం
లక్నో సూపర్ జెయింట్స్ కు గుడ్ బై
జెడ్డా – వచ్చే ఏడాది టాటా ఐపీఎల్ టోర్నీకి సంబంధించి జెడ్డా వేదికగా వేలం పాట కొనసాగుతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. భారీ ఎత్తున పోటీ నెలకొంది . ఆటగాళ్లను స్వంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటి వరకు అత్యధిక ధరకు పంత్ అమ్ముడు పోగా. కేఎల్ రాహుల్ ఎవరు తీసుకుంటారనే ఉత్కంఠకు తెర పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ 14 కోట్లకు స్వంతం చేసుకుంది. ఇక తిలక్ వర్మను రూ. 8 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు రిటైన్ చేసుకుంది. అభిషేక్ శర్మను రూ.14 కోట్లకు తిరిగి తీసుకుంది హైదరాబాద్ .
మరో వైపు సూర్య భాయ్ ని రూ. 16.35 కోట్లకు ముంబై తీసేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ. 18 కోట్లకు యుజ్వేంద్ర చాహల్ ను స్వంతం చేసుకోగా, రాజస్థాన్ కు ఆడిన జోస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ రూ. 15.75 కోట్లకు తీసుకుంది.
అందరూ అనుకున్నట్టుగానే రిషబ్ పంత్ , శ్రేయస్ అయ్యర్ లు భారీ ధరకు అమ్ముడు పోయారు. ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ సృష్టించారు పంత్. తనను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు తీసుకుంది. అంతకు ముందు సన్ రైజర్స్ రూ. 18 కోట్లకు ఆఫర్ ఇచ్చింది. కానీ వర్కవుట్ కాలేదు.
ఇదే సమయంలో మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అమ్ముడు పోయాడు. తనను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ స్వంతం చేసుకుంది. ఇదిలా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ డేవిడ్ మిల్లర్ ను రూ. 7.50 కోట్లకు తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహల్ కు పంట పండింది. అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు స్వంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఇది బంపర్ ఆఫర్ అని చెప్పక తప్పదు.