SPORTS

త‌ళుక్కుమ‌న్న కావ్య మార‌న్

Share it with your family & friends

ఐపీఎల్ వేలం పాట‌లో క‌ళ్ల‌న్నీ

జెడ్డా – ఈసారి ఐపీఎల్ వేలం పాట వ‌చ్చే ఏడాది టోర్నీకి సంబంధించి వినూత్నంగా జెడ్డాకు మార్చేసింది బీసీసీఐ. మొత్తం 10 ఫ్రాంచైజీలు పోటీ ప‌డుతున్నాయి. పోటా పోటీగా ఆట‌గాళ్ల‌ను స్వంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే మ‌రోసారి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సీఈవో కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. దీనికి కార‌ణం ఆమె వైపే అంద‌రి క‌ళ్లు ఉండ‌టం. జెడ్డాలో సైతం త‌ను త‌ళుక్కున మెరిసింది. మ‌హ్మ‌మ‌ద్ ష‌మీని రూ. 10 కోట్ల‌కు తీసుకుంది. ఇక స్టార్ హిట్ట‌ర్ గా పేరు పొందిన అభిషేక్ శ‌ర్మ‌ను రిటైన్ చేసుకుంది కావ్య పాప‌. మొత్తంగా ఐపీఎల్ కు అందం కూడా తోడైంద‌న్న‌మాట‌.

ఇక‌ కేఎల్ రాహుల్ ను ఎవ‌రు తీసుకుంటార‌నే ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని రూ 14 కోట్ల‌కు స్వంతం చేసుకుంది. ఇక తిల‌క్ వ‌ర్మ‌ను రూ. 8 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు రిటైన్ చేసుకుంది.

మ‌రో వైపు సూర్య భాయ్ ని రూ. 16.35 కోట్ల‌కు ముంబై తీసేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ రూ. 18 కోట్ల‌కు యుజ్వేంద్ర చాహ‌ల్ ను స్వంతం చేసుకోగా, రాజ‌స్థాన్ కు ఆడిన జోస్ బ‌ట్ల‌ర్ ను గుజ‌రాత్ టైటాన్స్ రూ. 15.75 కోట్లకు తీసుకుంది.