SPORTS

72 మంది ఆట‌గాళ్లు రూ. 467.95 కోట్లు

Share it with your family & friends

ఖ‌ర్చు చేసిన 10 జ‌ట్ల ఫ్రాంచైజీలు

జెడ్డా – ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం పాట జెడ్డా వేదిక‌గా జ‌రిగింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అత్య‌ధిక ధ‌ర‌కు భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ , వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అమ్ముడు పోయాడు. అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్ల‌కు తీసుకుంది. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ 26.75 కోట్ల‌కు తీసుకుంది పంజాబ్ కింగ్స్ ఎల‌వెన్. దీనికి ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింటా కో ఓన‌ర్ గా ఉంది.

తొలి రోజు మొత్తం 72 మంది ఆట‌గాళ్లు అమ్ముడు పోయారు. వేలం పాట‌కు వ‌చ్చిన ఆట‌గాళ్ల‌లో 12 మంది అమ్ముడు పోలేదు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ముంబై స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ రూ. 18 కోట్ల‌కు తీసుకుంది పీబీకేఎస్. వీరి కోసం ఫ్రాంచైజీలు తొలి రోజు ఏకంగా రూ. 467.95 కోట్లు వెచ్చించాయి. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు బిగ్ ఆద‌ర‌ణ ఉంటోంది. దీనిని ల‌లిత్ మోడీ ప్రారంభించాడు. పంత్, అయ్య‌ర్ త‌ర్వాత అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు వెంక‌టేశ్ అయ్య‌ర్. త‌న‌ను రూ. 23.75 కోట్ల‌కు తీసుకుంది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. అర్ష్ దీప్ సింగ్ ను రూ. 18 కోట్ల‌కు తీసుకుంది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్.
ఇషాన్ కిష‌న్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.11.25 కోట్ల‌కు చేజిక్కించుకుంది. స్టార్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ రూ. 12.50 కోట్ల‌కు అమ్ముడు పోయాడు.