కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఐపీఎల్ వేలం పాటలో తళుక్కుమంది
జెడ్డా – మరోసారి సంచలనంగా మారారు సన్ రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కావ్య మారన్. అందరి కళ్లు ఆమె వైపే ఉన్నాయి. జెడ్డా వేదికగా వచ్చే ఏడాది 2025లో జరిగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీకి సంబంధించి వేలం పాట కొనసాగుతోంది. ఈ వేలం పాట రెండు రోజుల పాటు కొనసాగుతుంది.
తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఇద్దరు ముద్దుగుమ్మలు. ఒకరు సినీ రంగానికి చెందిన ప్రీతి జింటా అయితే మరొకరు ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన కళానిధి మారన్ కుటుంబానికి చెందిన కావ్య మారన్. ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారనే సర్వే కూడా మొదలు పెట్టారు నెట్టింట్లో.
పది ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. అత్యధిక ధరకు రిషబ్ పంత్ అమ్ముడు పోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. ఇక షమీని రూ. 10 కోట్లు పెట్టి తీసుకుంది కావ్య మారన్. ప్రీతి జింటా చాహల్ ను రూ. 18 కోట్లకు తీసుకుంది. అంతే కాకుండా స్టార్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను కైవసం చేసుకుంది. ఏది ఏమైనా కావ్య పాప మరోసారి మెరిసింది.