ఐపీఎల్ వేలం పాటలో మెరిసిన ప్రీతి జింటా
మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలిచిన నటి
జెడ్డా – జెడ్డా వేదికగా జరిగిన టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) మెగా వేలం పాటలో తళుక్కున మెరిసింది ప్రముఖ వర్దమాన నటి ప్రీటి జింటా. ఆమె పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీకి కో ఓనర్ గా ఉన్నారు. ఆమెతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
వీరిద్దరిలో ఎవరు అసలైన అందగత్తెలు అనే చర్చ మొదలైంది క్రికెట్ ఫ్యాన్స్. కొందరేమో కావ్య మారన్ సూపర్ అంటే ప్రీతి జింటా అదుర్స్ అంటున్నారు మరికొందరు. మొత్తంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఐపీఎల్ వేలం పాటలో హైలెట్ గా నిలిచారు.
ఇక వేలం పాట విషయానికి వస్తే తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. పది ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి. అత్యధిక ధరకు రిషబ్ పంత్ అమ్ముడు పోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది.
ఇక షమీని రూ. 10 కోట్లు పెట్టి తీసుకుంది కావ్య మారన్. ప్రీతి జింటా చాహల్ ను రూ. 18 కోట్లకు తీసుకుంది. అంతే కాకుండా స్టార్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను కైవసం చేసుకుంది. ఏది ఏమైనా కావ్య పాప మరోసారి మెరిసింది.