వేలం పాటలో ఆర్సీబీ అత్యధికంగా ఖర్చు
ఎక్కువ ధరకు అమ్ముడు పోయిన పంత్
జెడ్డా – టాటా ఐపీఎల్ మెగా వేలం పాట తొలి రోజు ముగిసింది. మొత్తం 72 ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు ఖర్చు చేసి చేజిక్కించుకున్నాయి. ఈ ఆక్షన్ లో అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.
ఈ వేలం పాటలో ముగ్గురు ఆటగాళ్లు రూ. 20 కోట్లకు పైగా ధరకు అమ్ముడు పోయారు. వారిలో రిషబ్ పంత్ రికార్డ్ సృష్టించాడు. తనను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు తీసుకుంది. ఇక వెంకటేశ్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 23.75 కోట్లకు, అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
చాహల్ ను రూ. 18 కోట్లకు చేజిక్కించుకుంది పంజాబ్ కింగ్స్ , అర్ష్ దీప్ సింగ్ ను కూడా అదే మేనేజ్ మెంట్ కైవసం చేసుకుంది. తనను కూడా రూ. 18 కోట్లు పెట్టి తీసుకుంది. ఇక ఇవాళ జరిగే రెండో రోజు వేలంపాటలో భువనేశ్వర్ కుమార్, డుఫ్లెసిస్ , వాషింగ్టన్ సుందర్ , మార్కో జాన్సన్ , దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు రానున్నారు.