రెండో రోజు వేలం పాటపై ఫ్రాంచైజీలు ఫోకస్
ఆయా జట్ల వద్ద మిగిలి ఉన్న రూపాయలు
జెడ్డా – టాటా మెగా ఐపీఎల్ వేలం పాట 2025కి సంబంధించి తొలి రోజు ముగిసింది. మొత్తం 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లకు తీసుకున్నారు. అత్యధిక ధరకు ముగ్గురు ఆటగాళ్లు రూ. 20 కోట్లకు పైగా అమ్ముడు పోయారు. వారిలో రిషబ్ పంత్ , వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ లు ఉన్నారు.
ఇక జట్ల పరంగా చూస్తే లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు పంత్ ను కైవసం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ అయ్యర్ తో పాటు యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్ ను అట్టి పెట్టుకుంది. ఇక రెండో రోజు వేలం పాటకు సంబంధించి ఫ్రాంచైజీల వద్ద ఎంతెంత డబ్బులు ఉన్నాయనేది చూస్తే ఆర్సీబీ వద్ద కొంత మొత్తం ఉంది.
ఆర్సీబీ 6 గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారి వద్ద రూ. 36.65 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ దగ్గర రూ. 26.10 కోట్లు ఉండగా నలుగురిని తీసుకుంది. ఇందులో ఇద్దరు రిటైన్ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 10 మందిని తీసుకుంది. వారి వద్ద రూ. 22.50 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ 9 మందిని తీసుకుంది. వారి వద్ద రూ.17.5 కోట్లు మిగిలి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 5 గురు ఆటగాళ్లను కైవసం చేసుకుంది. వారి వద్ద రూ. 17.35 కోట్లు ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 15.6 కోట్లు మిగిలి ఉండగా 7 మందిని తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 7 గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆ జట్టు వద్ద రూ. 14.85 కోట్లు మిగిలి ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ 9 మంది ఆటగాళ్లను తీసుకోగా ఆ జట్టు వద్ద ఇంకా రూ. 15.8 కోట్లు ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 10.05 కోట్లు ఉన్నాయి..ఎనిమిది మంది ఆటగాళ్లను తీసుకుంది. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ రూ. 5.15 కోట్లు ఉన్నాయి..8 మందిని తీసుకుంది.