NEWSTELANGANA

హౌసింగ్ సొసైటీల భూములు ర‌ద్దు

Share it with your family & friends

సంచ‌ల‌న తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు

ఢిల్లీ – హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో కేటాయించిన భూములు చెల్లుబాటు కావంటూ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు. ఆయా ప్ర‌భుత్వాలు గ‌తంలో ప్ర‌జా ప్ర‌తినిధులు, జ‌ర్న‌లిస్టులు, ఇత‌రుల‌కు స్థ‌లాలు కేటాయించింది. భూములు కేటాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. సోమ‌వారం దీనిపై విచార‌ణ చేప‌ట్టింది.

సీజేఐ సంజ‌య్ ఖ‌న్నా సార‌థ్యంలోని ధ‌ర్మాసం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. హౌసింగ్ సొసైటీల‌కు కేటాయించిన భూ కేటాయింపులు చెల్లుబాటు కావంటూ పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేటాయించిన భూముల‌లో ప్ర‌జా ప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు, జ‌ర్న‌లిస్టులు ఉన్నారు.

వీరికి కేటాయించ‌డం త‌ప్పంటూ రావు బి చెలికాని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం కీల‌క తీర్పు వెలువ‌రించింది. తాజాగా తెలంగాణ‌లో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీలో స‌భ్యుల‌కు ఇండ్ల స్థ‌లాలు మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మ‌రోసారి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు.