SPORTS

తిప్పేసిన స్పీడ్ స్ట‌ర్ త‌ల‌వంచిన ఆసిస్

Share it with your family & friends

239 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

ఆస్ట్రేలియా – ఆస్ట్రేలియాలోని పెర్త్ లో జ‌రిగిన తొలి టెస్ట్ లో ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య ఆసిస్ జ‌ట్టుకు. 239 ప‌రుగుల తేడాతో తొలి టెస్టులో గెలుపొందింది. స్వ‌దేశంలో జ‌రిగిన మూడు టెస్టుల సీరీస్ లో కీవీస్ తో ఘోరంగా ఓట‌మి పాలైంది.

కానీ ఆ అప‌జయాన్ని మ‌రిపిస్తూ విదేశీ గ‌డ్డ‌పై గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేయ‌డం విశేషం. రోహిత్ శ‌ర్మ లేకుండానే బుమ్రా నేతృత్వంలో భార‌త జ‌ట్టు అద్భుత స‌క్సెస్ ను అందుకుంది.

ఇటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపింది టీమిండియా. తొలుత 150 ర‌న్స్ కే ప‌రిమిత‌మైనా ఆసిస్ ను తొలి ఇన్నింగ్స్ లో క‌ట్ట‌డి చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది. టార్గెట్ ఛేదించ‌లేక ఆసిస్ చేతులెత్తేసింది.

రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌రీ కార‌ణంగా భార‌త జ‌ట్టుకు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా కీల‌క‌మైన పాత్ర పోషించాడు. ప్ర‌ధానంగా టాస్ గెలిచిన వెంట‌నే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ‌ట్టు త‌క్కువ స్కోర‌కే ప‌రిమితం కావ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా..ఆ త‌ర్వాత ఆసిస్ పై ఒత్తిడి పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కీల‌క‌మైన నాలుగు వికెట్ల‌ను కూల్చాడు. దీంతో ఆసిస్ ప‌త‌నం ప్రారంభ‌మైంది. మొత్తంగా బుమ్రా కెప్టెన్సీతో పాటు బౌలింగ్ ప‌రంగా త‌న‌దైన పాత్ర పోషించాడు.