షర్మిలకు సెక్యూరిటీ కల్పించండి
డీజీపికి రఘువీరా రెడ్డి సుదీర్ఘ లేఖ
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత కల్పించాలని లేక పోతే దాడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి నీలకంఠాపురం రఘు వీరా రెడ్డి. షర్మిలకు 4+4 సెక్యూరిటీ కలిగి ఉన్నారని, కానీ ప్రస్తుతం ఉన్నట్టుండి చివరకు ఇద్దరిని మాత్రమే సమకూర్చారని పేర్కొన్నారు. ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాల్సి వస్తోందని తెలిపారు రఘు వీరా రెడ్డి. ఒక జాతీయ స్థాయి పార్టీకి బాధ్యత కలిగిన నాయకురాలిగా ప్రస్తుతం వైఎస్ షర్మిలా రెడ్డి ఉన్నారని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆశించినంత మేర బాగో లేవన్నారు. ఈ తరుణంలో ఎవరు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా నాయకురాలికి రక్షణ లేక పోతే ఇక రాష్ట్రంలో ప్రజలకు ఎలా సెక్యూరిటీ కల్పిస్తారో ఆలోచించు కోవాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డికి సూచించారు. వెంటనే తగ్గించిన భద్రతను మరింత పెంచాలని కోరారు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి.