టీమిండియా సక్సెస్ అమిత్ షా కంగ్రాట్స్
239 పరుగుల తేడాతో అద్భుత విజయం
ముంబై – బీసీసీఐ కార్యదర్శి, ఐసీసీ చైర్మన్ జే షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఏకంగా ఆతిథ్య జట్టును 239 పరుగుల తేడాతో ఆసిస్ కు షాక్ ఇచ్చింది.
స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 కీలక వికెట్లు పడగొట్టాడు. 2వ ఇన్నింగ్స్ లో సిరాజ్ తో కలిసి మరో 3 వికెట్లు తీశాడు. ఈ సందర్బంగా భారత జట్టు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా.
బుమ్రా బౌలర్ గా, లీడర్ గా ఎదిగాడని ప్రశంసించారు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా విరాట్ కోహ్లీ 30వ శతకం చేయడాన్ని ప్రశంసించారు. విజయం సాధించినందుకు టీమిండియా ఆటగాళ్లకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు జే షా. మిగతా 4 టెస్టులలో గ్రాండ్ విక్టరీ నమోదు చేయాలని కోరారు.