ఇవాంకా ట్రంప్ నెట్టింట్లో వైరల్
కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర
అమెరికా – ఇవానా మేరీ (ఇవాంకా) ట్రంప్ నెట్టింట్లో వైరల్ గా మరారు. ట్రంప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అక్టోబర్ 30, 1981లో పుట్టారు. వ్యాపారవేత్తగా పేరు పొందారు. పలు పుస్తకాలు కూడా రాశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆమె నైజం. తండ్రికి ప్రధానమైన సలహాదారుగా ఉన్నారు ఇవాంకా ట్రంప్.
ట్రంప్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన టీవీ షో, ది అప్రెంటీస్ లో బోర్డ్ రూమ్ న్యాయమూర్తిగా కూడా ఉన్నారు ఇవాంకా ట్రంప్. 2017లో సీనియర్ సలహాదారుగా పని చేశారు. 15 ఏళ్ల వరకు చాపిన్ స్కూల్ లో చదివారు. ఇదే సమయంలో మోడలింగ్ కూడా చేశారు.
1997లో ఇవాంకా ట్రంప్ సెలబ్ మామ్స్ అండ్ డాటర్స్ కథనం నడిపిన సెవన్జీన్ ముఖ చిత్రంపై ఆమె కనిపించింది. ఆ తర్వాత జార్జ్ టౌన్ యూనివర్శిటీలో చదివారు. 2004లో ఆర్థిక శాస్త్రంలో బ్యాచ్ లర్ డిగ్రీ చదివారు. 2009లో జారెడ్ తో పెళ్లి చేసుకుంది.
2016లో ప్రారంభించిన 200 మిలియన్ల భవనాన్ని విలాసవంతమైన హోటల్ గా మార్చడాన్ని పర్యవేక్షించారు ఇవాంకా ట్రంప్. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా ప్రవేశించారు. ప్రస్తుతం నెట్టింట్లో ఆమెకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.