చిరంజీవికి రోజా రమణి అభినందన
పద్మ విభూషణ్ దక్కిన పురస్కారం
హైదరాబాద్ – కేంద్ర ప్రభుత్వం అత్యంత ఉన్నతమైన రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ వేత్త, వక్త, రచయిత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు కష్టపడి స్వయం కృషిని నమ్ముకుని మెగాస్టార్ గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవిని కూడా ఎంపిక చేసింది.
ఈ సందర్బంగా ప్రశంసలతో పాటు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రంగానికి చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు చిరంజీవిని అభినందనలతో ముంచెత్తారు.
తాజాగా ప్రముఖ నటి రోజా రమణి, ఆమె భర్త నటుడు చక్రపాణి, తనయుడు లవర్ బాయ్ గా పేరు పొందిన తరుణ్ మెగాస్టార్ ను వారి నివాసంలో కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం ఉంచి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు.