SPORTS

ఆల్ రౌండ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టిన ఫ్రాంచైజీలు

Share it with your family & friends

శార్దూల్ ఠాకూర్..సికింద‌ర్ ర‌జా కు బిగ్ షాక్
హైద‌రాబాద్ – జెడ్డా వేదిక‌గా జ‌రిగిన టాటా ఐపీఎల్ మెగా వేలం పాట ముగిసింది. మొత్తం 182 ప్లేయ‌ర్ల‌ను 639.95 కోట్లు ఖ‌ర్చు చేసి కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. కానీ కీల‌క‌మైన బౌల‌ర్లు, బ్యాట‌ర్లు, ఆల్ రౌండ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఒకింత క్రికెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేశాయి . పూర్తిగా డిమాండ్ అండ్ స‌ప్లై ఆధారంగా మారి పోయింది వేలం పాట‌.

తాజాగా ఐపీఎల్ మెగా వేలం పాట‌లో కీల‌క‌మైన ఆల్ రౌండ‌ర్లు మిగిలి పోయారు. ఇందులో శార్దూల్ ఠాకూర్, సికింద‌ర్ ర‌జా ఉన్నారు. వైట్-బాల్ క్రికెట్‌లో నిస్సందేహంగా స్టార్ అయిన డారిల్ మిచెల్ ను ప‌క్క‌న పెట్ట‌డం విస్తు పోయేలా చేసింది.

ఇక అమ్ముడు పోయిన ఆట‌గాళ్ల జాబితా ఇలా ఉంది. ఉత్క‌ర్ష్ సింగ్ రూ . 30 ల‌క్ష‌లు, శార్దూల్ ఠాకూర్ రూ. 2 కోట్లు, డారెల్ మిచెల్ రూ. 2 కోట్లు, మ‌యాంక్ దాగ‌ర్ రూ. 30 ల‌క్ష‌లు, రిషి ధావ‌న్ రూ. 30 ల‌క్ష‌లు, శివ‌మ్ సింగ్ రూ. 30 ల‌క్ష‌లు, గ‌స్ అట్కిన్స‌న్ రూ. 2 కోట్లు, సికింద‌ర్ రజా రూ. 1.25 కోట్లు, కైల్ మేయ‌ర్స్ రూ. 1.50 కోట్లు, మాథ్యూ సార్ట్ రూ. 75 ల‌క్ష‌లతో బేస్ ధ‌ర‌తో వేలం పాట‌లోకి వ‌చ్చారు.

వీరితో పాటు ఎమాన్‌జోత్ చాహల్ రూ. 30 లక్షలు, మైఖేల్ బ్రేస్‌వెల్ రూ. 1.50 కోట్లు, అబ్దుల్ బాసిత్ రూ. 30 లక్షలు, రాజ్ లింబాని రూ. 30 లక్షలు, శివ సింగ్ రూ. 30 లక్షలు, డ్వైన్ ప్రిటోరియస్ రూ. 75 లక్షలు, బ్రాండన్ మెక్‌ముల్లెన్ రూ. 30 ల‌క్ష‌లు, అతిత్ షెత్ రూ. 30 లక్షలు, రోస్టన్ చేజ్ రూ. 75 లక్షలు, నాథన్ స్మిత్ రూ. 1 కోటి రూపాయలు, రిపాల్ పటేల్ రూ. 30 లక్షలు, సంజయ్ యాదవ్ రూ. 30 లక్షలకు బేస్ ధ‌ర‌కు వ‌చ్చారు.

వీరితో పాటు ఉమంగ్ కుమార్ రూ. 30 లక్షలు, దిగ్విజయ్ దేశ్‌ముఖ్ రూ. 30 లక్షలు, యష్ దాబాస్ రూ. 30 లక్షలు, తనుష్ కోటియన్ రూ. 30 లక్షలు, క్రివిట్సో కెన్స్ రూ. 30 లక్షలకు వ‌చ్చినా అమ్ముడు పోలేదు.