సత్తా చాటేందుకు సన్ రైజర్స్ రెడీ
ముగిసిన వేలం..తుది జట్టు ఇదే
హైదరాబాద్ – కావ్య మారన్ సీఈవోగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లను తీసుకుంది. భారీ ధరకు స్టార్ పేసర్ షమీని కైవసం చేసుకుంది. అతడికి రూ. 10 కోట్లు వెచ్చించింది కావ్య పాప. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీలో దుమ్ము రేపింది ఈ జట్టు. భారత జట్టులో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్ ను తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. వికెట్ కీపర్ , విధ్వంసకరమైన బ్యాటర్లుగా పేరు పొందిన ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మలను రిటైన్ చేసుకుంది.
ప్రధానమైన బౌలర్లు ఉన్నప్పటికీ కీలకమైన స్పిన్నర్లు లేక పోవడం ఈ జట్టుకు ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. అయితే ఆడం జంపా, రాహుల్ చాహర్ లు ఉన్నారు. ఇక వేలం పాటలో రూ. 10 కోట్లకు షమీ, పటేల్ ను రూ. 8 కోట్లు, కిషన్ రూ. 11.25 కోట్లు, రాహుల్ చాహర్ రూ. 3.2 కోట్లు, ఆడం జంపా్ ను రూ. 2.40 కోట్లు, అథర్వ తైదేను రూ. 30 లక్షలకు , అభినవ్ మనోహర్ ను రూ. 3.20 కోట్లు, సిమర్జిత్ సింగ్ ను రూ. 1.50 కోట్లు, జీసన్ అన్సారీని రూ. 40 లక్షలకు కొనుగోలు చేసింది.
వీరితో పాటు జయదేవ్ ఉనాద్కత్ రూ. కోటి, బ్రైడన్ కార్సే రూ. ఒక కోటి, కమిందు మెండీస్ ను రూ. 75 లక్షలకు, అనికేత్ వర్మను రూ. 30 లక్షలు, ఎషాన్ మలింగను రూ. 1.20 కోట్లకు, సచిన్ బేబీని రూ. 30 లక్షలు పెట్టి కైవసం చేసుకుంది కావ్య పాప.
తుది జట్టు పరంగా చూస్తే..పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సేస్, బ్రైడన్ కార్సేస్ , అనికేత్ వర్మ, ఈషాన్ మలింగ, సచిన్ బేబీ ఉన్నారు.