భావోద్వేగానికి లోనైన రిషబ్ పంత్
ఢిల్లీని విడిచి పెట్టడం బాధాకరం
ఢిల్లీ – ఐపీఎల్ వేలం ముగిసింది. ప్రపంచ క్రికెట్ ను విస్తు పోయేలా చేసింది ఐపీఎల్ వేలం పాట. ఇందులో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ క్రికెటర్ రిషబ్ పంత్. ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించాడు. తను ఆసిస్ టూర్ లో ఉన్నాడు. ఈ సందర్బంగా లక్నో సూపర్ జెయింట్స్ తనను రూ. 27 కోట్లకు చేజిక్కించుకుంది. ఇది రికార్డ్ స్థాయిలో ధర పలకడం విస్తు పోయేలా చేసింది.
తనకు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఎనలేని బంధం ఉందని, తాను ఆ జట్టును వీడడం బాధ కలిగించిందని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ తో కొన్నేళ్ల పాటు ఉన్నాడు. దాదాపు 9 సంవత్సరాలుగా ఆ జట్టుతోనే జర్నీ చేశాడు.
తాను తీవ్ర ఆవేదన చెందుతున్నానని, బాధతప్త హృదయంతో ఢిల్లీకి వీడ్కోలు పలుకుతున్నానని పేర్కొన్నాడు రిషబ్ పంత్. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎక్స్ లో.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం అద్భుతమైనది కాదు. మైదానంలో ఉత్కంఠ భరితమైన క్షణాల వరకు, నేను ఊహించని విధంగా నేను పెరిగాను. నేను ఇక్కడికి వచ్చాను. చూస్తూ ఉండగానే తొమ్మిది ఏళ్లు గడిచి పోయాయి. ఒక రకంగా కుటుంబ బంధం ఇది అని పేర్కొన్నాడు పంత్. నన్ను ఫ్యాన్స్ అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. అంతే కాదు కష్టమైన సమయంలో కూడా మీరంతా అండగా నిలిచారని కొనియాడారు.