SPORTS

బ‌ట్ల‌ర్ రాక‌తో గుజ‌రాత్ పెరిగిన బ‌లం

Share it with your family & friends

టైటాన్స్ టీం ఫైన‌ల్ స్క్వాడ్ ఇదే

గుజ‌రాత్ – అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ గుజ‌రాత్ టైటాన్స్ జోస్ బ‌ట్ల‌ర్ ను తీసుకుంది. ఈసారి జ‌ట్టు మ‌రింత బ‌లంగా క‌నిపిస్తోంది. సౌదీ అరేబియా లోని జెడ్డాలో జ‌రిగిన వేలం పాట‌లో కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను స్వంతం చేసుకుంది . ఈసారి ఆక్ష‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం రూ. 68.85 కోట్లు ఖ‌ర్చు చేసింది.

ఈ భారీ మొత్తంలో అధిక మొత్తం వైట్ బాల్ కెప్టెన్ జోస్ ను తీసుకునేందుకు ప్ర‌యారిటీ ఇచ్చింది. జోస్ బ‌ట్ల‌ర్ ను రూ. 15.75 కోట్ల‌కు తీసుకోవ‌డం విశేషం. అలాగే క‌గిసో ర‌బాడాను రూ. 10.75 కోట్ల‌కు, సిరాజ్ ను రూ. 12.25 కోట్ల‌కు, ప్ర‌సిద్ద్ కృష్ణ‌ను రూ. 9.50 కోట్ల‌కు, నిశాంత్ సింధును రూ. 30 ల‌క్ష‌ల‌కు, మ‌హిపాల్ లోమ్రోర్ ను రూ. 1.70 కోట్ల‌కు కైవ‌సం చేసుకుంది గుజ‌రాత్ టైటాన్స్.

వీరితో పాటు కుమార్ కుషాగ్రాను రూ. 65 ల‌క్ష‌ల‌కు, అనూజ్ రావ‌త్ ను రూ. 30 ల‌క్ష‌ల‌కు, మాన‌వ్ సుతార్ ను రూ. 30 ల‌క్ష‌లు పెట్టి తొలి రోజు తీసుకుంది. ఇక రెండ‌వ రోజు వేలం పాట‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను రూ. 3.2 కోట్ల‌కు, కోయెట్టీని రూ. 2.40 కోట్లు, అర్ష‌ద్ ఖాన్ ను రూ. 1.30 కోట్ల‌కు, గుర్నూర్ బ్రార్ ను రూ. 1.30 కోట్ల‌కు, రూథ‌ర్ ఫోర్డ్ ను రూ. 2.60 కోట్ల‌కు తీసుకుంది.

ఆర్. సాయి కిషోర్ ను రూ. 2 కోట్ల‌కు, ఇషాంత్ శ‌ర్మ‌ను రూ. 75 ల‌క్ష‌ల‌కు, జ‌యంత్ యాద‌వ్ ను రూ. 75 ల‌క్ష‌ల‌కు, గ్లెన్ ఫిలిప్స్ ను రూ. 2 కోట్లు, క‌రీం జ‌న‌త్ ను రూ. 75 ల‌క్ష‌ల‌కు, కుల్వంత ఖేజ్రోలియాను రూ. 30 ల‌క్ష‌ల‌కు తీసుకుంది.

ఇక ర‌షీద్ ఖాన్ ను రూ. 18 కోట్ల‌కు, గిల్ ను రూ. 16.50 కోట్ల‌కు, సాయి సుద‌ర్శ‌న్ ను రూ. 8.50 కోట్ల‌కు, రాహుల్ తెవాటియాను రూ. 4 కోట్ల‌కు , షారుక్ ఖాన్ ను రూ. 4 కోట్ల‌కు అట్టి పెట్టుకుంది గుజ‌రాత్ టైటాన్స్.