కావ్య మారన్ ఎమోషనల్
ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు
చెన్నై – సన్ రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ (సీఈవో) కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమె స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి ఎమోషనకు గురయ్యారు. తను తమ జట్టులో లేక పోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ వేలం పాటలో తమ జట్టు నుంచి భువీని వదులు కోవడం ఒకింత ఆవేదన కలుగుతోందని, అయినా తప్పడం లేదని తెలిపింది కావ్య మారన్.
భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని తమ జట్టులో ఓ సభ్యుడి గా ఇంత కాలం కలిసి ఉన్నాడని, తనను మరిచి పోలేక పోతున్నామని స్పష్టం చేశారు సీఈవో . తాను తనను తీసుకోక పొవడం పట్ల ఏమీ అనుకోవద్దంటూ భువనేశ్వర్ కుమార్ ను ఉద్దేశించి కోరారు కావ్య మారన్.
ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ మెగా వేలం పాటలో భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ స్వంతం చేసుకుంది. తనపై భారీ ధర పెట్టింది. మొత్తంగా భువీ ఫోటోను షేర్ చేయడంతో కావ్య మారన్ వైరల్ గా మారింది.